నభా నటేష్ కి నిరాశే

నాగ చైతన్య సరసన నభ నటేష్ ఫిక్స్ అయిందని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజముంది. ఆమె పేరుని పరిశీలించారు. ఐతే, చివరికి నభా కన్నా రాశి ఖన్నా బెటర్ అని అనుకున్నారట డైరక్టర్ విక్రమ్ కుమార్. అలా… ‘థాంక్యూ’ సినిమాలో నాగ చైతన్య సరసన మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా సెటిల్ అయింది.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో పాపులరయిన నభాకి పెద్ద సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తోంది. ఆమె కెరియర్ మరో అడుగు ముందుకు పడడం లేదు. చైతన్య సినిమా కూడా మిస్ కావడం ఆమెకి మైనస్సే.

More

Related Stories