
హీరోయిన్లను టాటూల్ని విడదీసి చూడలేం. తమ ఒంటిపై అరడజను టాటూలు వేయించుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. పైకి చూపించలేని సీక్రెట్ ప్లేసుల్లో పచ్చబొట్టు పొడిపించుకున్న భామలు కూడా ఉన్నారు. ఇలాంటి రోజుల్లో అసలు ఒంటిపై పచ్చబొట్టు లేని హీరోయిన్లు ఉంటారా? దీనికి సమాధానంగా నిలుస్తోంది నభా నటేష్
అవును.. ఈమె ఒంటిపై ఒక్క టాటూ కూడా లేదట. అలా అని ఈమె పచ్చబొట్టుకు వ్యతిరేకం కాదు. టాటూలపై ఈ ముద్దుగుమ్మ ఏమంటోందంటే…
“నా ఒంటిపై ఇప్పటివరకు టాటూ పడలేదు. కానీ ఇప్పుడైతే నాకు టాటూ వేయించుకోవాలనే ఉంది. అయితే ఏ టాటూ వేయించుకోవాలో అర్థం కావడం లేదు. కొన్నేళ్లుగా ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మీకేమైనా తెలిస్తే చెప్పండి. త్వరలోనే దీనిపై ఓ డెసిషన్ తీసుకుంటాను,” అంటూ మాట్లాడుతోంది.
ఇలా తన టాటూ స్టోరీ బయటపెట్టింది నభా నటేష్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సాయితేజ్ సరసన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా చేస్తోంది.