
“ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచింది నభా నటేష్. ఇందులో భాగంగా ఇప్పటికే సాయితేజ్ సరసన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరో సినిమాని లైన్లో పెట్టేలా ఉంది.
నభా నటేష్ కి అఫర్ వచ్చిన ఆ సినిమా “అంథాధున్” రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి నభాని అడిగారట. ఐతే ఇంకా సైన్ చెయ్యలేదు. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రలో తెలుగులో నభా కనిపించబోతోంది.
హిందీ వెర్షన్ లో హీరోహీరోయిన్ల మధ్య 2 హాట్ సీన్స్ ఉన్నాయి. మరి తెలుగు రీమేక్ లో నభా అలాంటి సీన్లలో కనిపిస్తుందా లేక స్క్రిప్ట్ మార్చేశారా అనేది చూడాలి.
Also Check: Nabha Natesh Photos
మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఇంకా అలానే ఖాళీగానే ఉంది. టబు పోషించిన ఆ పాత్ర కోసం తెలుగులో ఎవర్ని తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.