
నభా నటేష్ కూడా సోయగాల షోలో కొంచెం డోస్ పెంచుతోంది. తప్పదు మరి. ఈ భామ కెరీర్ కి బూస్ట్ కావాలి. రేస్ లో పూర్తిగా వెనుకబడింది. ‘మాస్ట్రో’ సినిమాలో నితిన్ సరసన నటించింది. అది త్వరలోనే హాట్ స్టార్ లో విడుదల కానుంది. థియేటర్లో రిలీజ్ కాదు. సో, ఆమె కెరీర్ కిది హెల్ప్ అయ్యే చిత్రం కాదు.
‘మాస్ట్రో’… బాలీవుడ్ లో హిట్టైన ‘అంధధూన్’ సినిమాకి రీమేక్. ఒరిజినల్ సినిమా చూసినవారెవ్వరైనా చెప్పగలరు నభాది ఇందులో కూరలో కరివేపాకు లాంటి పాత్ర అన్న విషయం. అందుకే, ఆమె కెరీర్ కి ఇప్పుడు జోష్ రావాలని గ్లామర్ ఫోటోషూట్లు తెగ చేస్తోంది.
ALSO CHECK: Nabha Natesh’s new style
నభా త్వరలోనే గోపీచంద్ సరసన ఒక మూవీ చేసే అవకాశం ఉంది. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తన 30వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో ఒక భామగా నభాని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమా ఖాయం అయ్యేలోపే తన అందచందాలను ఇన్ స్టాగ్రామ్ వేదికపై పరిచింది.
రామ్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత ఏ సినిమా ఆమెకి క్రేజ్ ని తీసుకురాలేదు.