ప్రీ-ప్రొడక్షన్ లో నాగ్ అశ్విన్ బిజీ

Nag Ashwin

ప్రభాస్ ఆల్రెడీ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అటు ‘సలార్’, ఇటు ‘ఆదిపురుష్’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు కూడా భారీ చిత్రాలే. ఐతే, ఈ సినిమాల దర్శకులు ప్రశాంత్ నీల్ (సలార్), ఓం రౌత్ (అదిపురుష్) స్పీడ్ గా తీసే డైరెక్టర్స్. పక్కా ప్లానింగ్ తో మూవీస్ పూర్తి చేస్తారు.

కాబట్టి… నాగ్ అశ్విన్ సినిమాని ప్రభాస్ పక్కన పెట్టట్లేదు. ఈ సినిమాని కూడా ఈ ఏడాదే షురూ చేస్తాడట. నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ఎలా వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇంతకుముందు ‘ప్రాజెక్ట్’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ని ప్రభాస్ రిజెక్ట్ చేశాడట. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తారు. మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More

Related Stories