ప్రభాస్ రాముడే: దర్శకుడు

“ఆది పురుష్” సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? మూవీ కథ ఏంటనే విషయంలో చాలా చర్చ జరిగింది పొద్దంతా. చివరికి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంతకీ, నాగ్ అశ్విన్ కి, “ఆది పురుష్”కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వెల్, ప్రభాస్ 21వ చిత్రం తీస్తున్న దర్శకుడికి ఆ మాత్రం తెలీదా తన హీరో మరో సినిమా గురించి.

నాగ్ అశ్విన్… ప్రభాస్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశాడు. అందులోనే… రాముడిగా ప్రభాస్ నటించబోతున్నాడని, ఆ దేవుడి పాత్రలో అతికొద్దిమంది నటులు మాత్రమే రాణించారన్నట్లుగా మెన్షన్ చేశాడు. అలా…. ప్రభాస్ కొత్త సినిమాపై ఉన్న అన్ని డౌట్స్ కి ఎండ్ కార్డు పండింది.

మరి… నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఈ “ఆది పురుష్” ఎప్పుడు కొబ్బరికాయ కొడుతారు అనేదానికి కూడా సమాధానం దొరికింది. రెండూ వచ్చే ఏడాదే మొదలవుతాయి. “ఆది పురుష్”కి కొన్ని నెలలు, నాగ్ అశ్విన్ సినిమాకి కొన్ని నెలలు టైం కేటాయిస్తాడట. రెండూ గ్రాఫిక్స్ తో కూడుకున్నవే. అందుకే, రెండింటికి విజువల్ ఎఫెక్ట్స్ కి కావాల్సిన సీన్లు ముందు ఇచ్చేసి… ఆ తర్వాత మిగతావి ప్లాన్ చేస్తాడట.

ఐతే, రాముడి గెటప్ చాలా కొత్తగా ఉంటుందిట. ఎందుకంటే… ఈ సినిమా రామాయణంలో ఒక కీలకమైన భాగాన్నే చూపించనుంది. ఆ భాగంలో రాముడి గెటప్ ని దర్శకుడు ఓం రౌత్ వైవిధ్యంగా విజువలైజ్ చేసుకున్నాడని అంటున్నారు.

More

Related Stories