
పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దాంతో, పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు ప్రకాష్ రాజ్ మాటలకు కౌంటర్ గా ట్విట్టర్లో లెటర్ పెట్టారు. ఇదంతా… GHMC ఎన్నికల గోల. పవన్ కళ్యాణ్ ghmc ఎన్నికల్లో టీఆరెస్ ని ఓడించి, బీజేపీకి ఓటేయమనడానికి వెనుక “విస్తృత ప్రయోజనాలు” ఉన్నాయి అని నాగబాబు ప్రకాష్ రాజ్ కి ఇచ్చిన ఆన్సర్ ఇది.
“రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్ లో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఐతే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ GHMC ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చెయ్యటం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలున్నాయని నా నమ్మకం. ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేశాడని, ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. Mr. ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రమణ్యస్వామి డిబేట్లోనే అర్థమైంది,” ఇలా తన లెటర్లో నాగబాబు ప్రకాష్ రాజ్ కి ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
ఇంతకీ, ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఏంటి? నాగబాబుకి ఎందుకంత మండింది? ఆయన ఏమన్నాడంటే…
“పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లి. 2014 ఎన్నికల్లో బీజేపీ -టీడీపీ కూటమికి ప్రచారం చేశాడు. 2019లో మళ్ళీ ప్లేట్ ఫిరాయించి లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ జపం చేస్తున్నాడు. ఆయనకి ఒక స్థిరత్వం ఉందా? సిద్ధాంతం ఉందా?” – ఇది ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్.