
నాగ చైతన్య ‘జోష్’ అనే సినిమాతో అడుగుపెట్టాడు. కానీ చైతన్యకి మొదటి విజయం దక్కింది ‘ఏ మాయ చేసావె’ అనే సినిమాతో. సమంతకి విడుదలైన మొదటి మూవీ అది. ఆమె తమిళంలో అంతకుముందు ఒక మూవీలో నటించినా అది ముందు విడుదల కాలేదు. వీరి జంటకి సూపర్ హిట్ జంట అనే పేరు వచ్చింది.
కానీ సమంత ‘దూకుడు’లో ఛాన్స్ కొట్టేసి పెద్ద హీరోయిన్ల జాబితాలోకి క్విక్ గా వెళ్ళిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని, విజయ్, ధనుష్, సూర్య,…. ఇలా సౌత్ లో పాపులర్ హీరోలందరి సరసన నటించి సమంత తన క్రేజుని నిలబెట్టుకొంది. మరోవైపు, ఈ పదేళ్లలో నాగ చైతన్య కూడా హీరోగా మంచి పొజిషన్ లో నిలబడ్డాడు.
సమంత, నాగ చైతన్య ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాల్లో నటించిన టైంలో చేరువయ్యారు. స్క్రీన్ మీద పండించిన కెమిస్ట్రీ నిజజీవితంలో కూడా పండింది. అలా… 2017 అక్టోబర్ లో ఓ జంటగా మారారు సమంత, నాగ చైతన్య. ఈ జంటకి ‘చై సామ్’ అని ముద్దు పేరు పెట్టింది అభిమానగణం.
పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు చేసింది. ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’ వంటి సినిమాలు, ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వంటి వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

ALSO READ: Naga Chaitanya and Samantha announce separation
పెళ్ళయాక ఈ జంట ‘మజిలీ’ అనే సూపర్ హిట్ మూవీ కూడా డెలివరీ చేసింది. మొత్తంగా… ‘ఏ మాయ చేసావె’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’ అనే నాలుగు సినిమాల్లో నటించారు నాగ చైతన్య, సమంత. నాలుగేళ్లు కాపురం చేశారు. వచ్చేవారం (అక్టోబర్ 7) వెడ్డింగ్ యానివర్సరీ. కానీ దానికన్నా ముందే విడిపోతున్నట్లు ప్రకటించారు.