చైసామ్ న్యూ ఇయర్ వెకేషన్

Chaitanya and Samantha

చైతన్య, సమంత మళ్ళీ వెకేషన్ కి వెళ్లారు. మొన్నే మాల్దీవుల్లో వారం రోజుల పాటు వెకేషన్ గడిపింది ఈ జంట. ఇప్పుడు కొత్త ఏడాదిని ఇన్వైట్ చేసేందుకు గోవా వెళ్లారు సమంత, చైతన్య. అక్కడ వాళ్లు ఒక విల్లా కూడా కట్టించుకున్నారని టాక్ ఉంది. అందులో నిజానిజాలెంతో కానీ… ఈ జంట రెగ్యులర్ గా గోవాలోనే అన్ని పార్టీలు చేసుకుంటుంది.

జనవరి మొదటివారంలో తిరిగి వస్తుంది ఈ అక్కినేని జంట.

సమంత ప్రస్తుతం కొన్ని యాడ్స్ లో నటిస్తోంది. ఒక టాక్ షో నిర్వహిస్తోంది. కానీ సినిమాలు ఇంకా సైన్ చెయ్యలేదు. ఇంతకుముందు ఒప్పుకున్న సినిమాలే రెండు ఉన్నాయి ఇక చైతన్య “థాంక్యూ” అనే సినిమాని సెట్స్ పై ఉంచాడు. “మనం” ఫేమ్ విక్రమ్ కుమార్ దీనికి దర్శకుడు. గోవా నుంచి వచ్చాక… మళ్లీ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటాడు.

More

Related Stories