ట్వీట్లతో క్లారిటీ వచ్చిందా?

Naga Chaitanya and Samantha


సమంత, నాగ చైతన్య త్వరలోనే విడాకులు తీసుకోబుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వారిద్దరి తాజా ట్వీట్లు కొత్త చర్చని లేపాయి. నిన్న విడుదలైన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ అద్భుతంగా ఉందని సమంత ట్వీట్ చేయడంతో అందరిలో ఆసక్తి రేగింది. ఐతే, నిన్న రాత్రి పలువురు సెలెబ్రెటీలకు రిప్లై ఇచ్చిన నాగ చైతన్య సమంత ట్వీట్ కి మాత్రం ఎలాంటి స్పందన తెలపలేదు.

కానీ మంగళవారం ఉదయం లేవగానే సమంతతో పాటు మరికొందరి సెలెబ్రిటీలకు సమాధానం ఇచ్చారు చైతన్య. సమంతకి ‘థాంక్స్ సామ్’ అంటూ ట్వీట్ చెయ్యడం విశేషం.

మరి ఈ రెండు ట్వీట్లతో వారి గురించి పుకార్లకు తెరపడినట్లేనా? తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఐతే, పెద్దలు కలగచేసుకోని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఐతే, అన్ని విభేదాలను పక్కన పెట్టి చై సామ్ కలిసిపోతారా? లేదా అన్నది చూడాలి.

చైతన్య, సమంత జంట కలిసి ఉండాలనేది అందరి కోరిక. వీరి విడాకుల గురించి మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి అభిమానులు కలత చెందుతున్నారు. తాజాగా ఇద్దరూ ట్వీట్స్ చెయ్యడంతో అభిమానుల మనసు కుదుటపడింది.

టీకప్పులో తుపానులా ముగిస్తే అందరికి సంతోషం.

 

More

Related Stories