
నాగ చైతన్య కూడా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నాడు. ఆయన మాజీ భార్య సమంత ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మేన్ 2’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు సమంత బాటలోనే నాగ చైతన్య నడుస్తున్నాడు. ‘దూత’ పేరుతో నాగ చైతన్య వెబ్ సిరీస్ చేయనున్నాడట.
ఈ వెబ్ సిరీస్ ఒక హారర్ థ్రిల్లర్. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దీనికి దర్శకుడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ‘దూత’ అంటే ఇదేదో ఒక మతానికి సంబంధించిన కథ అనుకోవద్దు. మనుషులకు సందేశాలు పంపాలి అనుకునే దెయ్యాలు ఒక మెసెంజర్ ని ఎంచుకుంటాయట. ఆ మెసెంజర్ నే దూత అని అంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది దెయ్యాల చుట్టూ తిరిగే కథ అని.
నాగ చైతన్య ఇప్పటికే బాలీవుడ్ లో కూడా ఒక మూవీ చేశాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ లు కూడా మొదలుపెట్టాడు. అంటే, తన ఫరిధిని పెంచుకుంటున్నాడన్నమాట.
మరోవైపు, నాగ చైతన్య హీరోగా ‘థాంక్యూ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.