భార్య బాటలో నాగ చైతన్య!

- Advertisement -
Naga Chaitanya and Samantha


సమంత వెబ్ సిరీస్ లో నటించింది. ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్… ది ఫ్యామిలీ మేన్ 2. అందులో ఆమెది నెగెటివ్ పాత్ర. సూపర్ హిట్ అయింది. సమంతకి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. దాంతో ఆమె భర్త కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ చెయ్యాలని ఉబలాటపడుతున్నాట్ట.

నాగ చైతన్య హీరోగా నిర్మాత శరత్ మరార్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు మీడియా కథనాలు. ఐతే, ఇది ఇప్పుడు మొదలవుతుందో చూడాలి.

నాగ చైతన్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ విడుదల కోసం వెయిట్ చేస్తోంది. హిందీలో చైతన్య నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ జరుగుతోంది. ఇక విక్రమ్ కుమార్ తీస్తున్న ‘థాంక్యూ’ షూటింగ్ చివరిదశకు చేరుకొంది. తాజాగా ‘బంగార్రాజు’ సినిమా ఒప్పుకున్నాడు.

 

More

Related Stories