విడాకుల వల్ల మంచే జరిగింది!

Naga Chaitanya


మొత్తానికి నాగ చైతన్య తన విడాకుల గురించి కుండబద్దలు కొట్టాడు. ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు చైతన్య. సినిమా విశేషాలు అడిగిన తర్వాత ఆటోమేటిక్ గా సమంతతో విడాకుల గురించి టాపిక్ తెచ్చారు జర్నలిస్టులు. ఎటువంటి సంకోచం లేకుండా సమాధానం ఇచ్చాడు. ఈ ప్రశ్న వస్తుందని ముందే ప్రిపేరయి వచ్చినట్లుగా అనిపించింది.

“ఇద్దరికీ మంచే జరిగింది. మేమున్న పరిస్థితుల్లో విడిపోవడమే కరెక్ట్ అనుకున్నాం. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. ఆమె ఆనందంగానే ఉంది. నేనూ హ్యాపీగా ఉన్నాను. ఇంతకుమించి ఏమి లేదు,” అని తేల్చేశాడు నాగ చైతన్య.

ఇక తన విడాకుల విషయాన్ని మీడియా మరింతగా లాగకుండా క్లారిటీ ఇచ్చాడు. కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా లేనప్పుడు విడిపోవడమే బెటర్ కదా అన్నట్లుగా నాగ చైతన్య మాట్లాడాడు.

‘బంగార్రాజు’ సినిమాలో తండ్రి నాగార్జునతో కలిసి నటించాడు చైతన్య. ఈ ఏడాది ‘థాంక్యూ’ చిత్రం కూడా విడుదల కానుంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు నాగ చైతన్య.

 

More

Related Stories