చైతూకు ఇష్టమైన సిరీస్ ఇదే

Naga Chaitanya

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్స్ పై పడ్డారు. కాజల్, తమన్న, లావణ్య త్రిపాఠి లాంటి ఎంతోమంది హీరోయిన్లు… రవితేజ, నిఖిల్, సాయితేజ్ లాంటి ఎంతోమంది హీరోలు తమకు ఇష్టమైన వెబ్ సిరీస్ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నాగచైతన్య కూడా చేరిపోయాడు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో తను చూసిన వెబ్ సిరీస్ ల లిస్ట్ పెట్టాడు చైతూ. ఇందులో “చెర్నోబిల్”, “ఫ్యామిలీ మేన్” లాంటి సూపర్ హిట్ సిరీస్ లు ఉన్నాయి. బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్, రైటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇందులో ఉన్నాయని.. చాలా స్ఫూర్తిదాయకంగా కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.

తన అభిమాన హీరో వెబ్ సిరీస్ గురించి రియాక్ట్ అయ్యేసరికి, ఫ్యాన్స్ కూడా తమకు ఇష్టమైన సిరీస్ పేర్లు చెప్పడం స్టార్ట్ చేశారు. వీలైతే అవి కూడా చూడాలని కోరుతున్నారు. మొత్తమ్మీద ఈ లాక్ డౌన్ టైమ్ లో నాగచైతన్య గట్టిగానే ఓటీటీమీద పడినట్టున్నాడు.

Related Stories