చైతన్య ప్రేమిస్తున్నది వీళ్ళనే!

Naga Chaitanya


నాగ చైతన్య ఫలానా వాళ్ళతో డేటింగ్ లో ఉన్నాడని చాలా ప్రచారం నడుస్తోంది. భార్య సమంతతో విడిపోవడానికి కారణం ఫలానా హీరోయిన్లు అని ఊహాగానాలు సాగాయి. పలువురు హీరోయిన్ల పేర్లని లాగారు. సమంత టీమ్ కొన్ని రూమర్లను వదిలింది. వాటిని నాగ చైతన్య పట్టించుకోలేదు. సమంత కక్షతో ఈ ప్రచారం చేయిస్తోందని లైట్ తీసుకున్నాడు.

తాజాగా తాను నిజంగా ప్రేమించేది ఎవరినో తెలిపాడు. ముగ్గురికి మాత్రమే తన జీవితంలో, మనసులో చోటు ఉందని రాశాడు. వాళ్ళు.. తన తల్లి లక్ష్మి, తన తండ్రి నాగార్జున, తన పెంపుడు కుక్క.

“అమ్మ.. సర్వం. తిరిగి ఏమి ఆశించకుండా ప్రేమ పంచే వ్యక్తి… ఎప్పటికప్పుడు నా గెలుపు కోసమే పాటుపడే శక్తి. నాన్న… సరయిన దారి చూపిన మార్గదర్శకుడు. మరే మిత్రుడు కూడా ఆయనలా ఉండరు. హుష్ (పెంపుడు కుక్క)… ఎలా ప్రేమించాలో, ఎలా మనిషిగా జీవించాలో నేర్పింది,” అని నాగ చైతన్య తాను ప్రేమించేది వీరినే అంటూ పేర్కొన్నాడు.

నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమా థీమ్ ప్రకారం తన జీవితంలో ఈ ముగ్గురికి మాత్రమే ఎప్పటికీ ‘థాంక్యూ’ చెప్పుకోవాలి అని రాసుకున్నాడు.

 

More

Related Stories