పబ్లిసిటీపై ఫోకస్ పెట్టిన చైతన్య

- Advertisement -
Naga Chaitanya Set Back


ఎవరికైనా రేసులో వెనుకబడినప్పుడే భయం వేస్తుంది. ముందుకెళ్లేందుకు ఏమి చెయ్యాలా అని తర్జన భర్జన పడుతుంటారు. అదే జరుగుతోంది నాగ చైతన్య విషయంలో. మొన్నటి వరకు ఈ హీరో తనకి, తన సినిమాలకు పబ్లిసిటీ వంటివి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సినిమా విడుదల అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈవెంట్ లకు అటెండ్ అయి మమ అనిపించేవాడు.

కానీ రెండు సినిమాలు ఫ్లాప్ కావడం ఇతర హీరోలు దూసుకుపోతుండడంతో నాగ చైతన్య కూడా మారిపోయాడు ఇప్పుడు. ‘లాల్ సింగ్ చద్దా’, ‘థాంక్యూ’ సినిమాలు అపజయం పాలయ్యాక ఇప్పుడు పబ్లిసిటీ అవసరం అనుకుంటున్నాడు.

కొత్త సినిమాకి స్టార్టింగ్ నుంచే ఎలా ప్రోమోట్ చెయ్యాలనే విషయంలో ఆలోచిస్తున్నాడట. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ సినిమాకి ముందు నుంచే హైప్ వచ్చేలా రెడీ అవుతున్నాడట.

నాగ చైతన్య సోషల్ మీడియాలో ఉన్నాడు. కానీ చాలా తక్కువగా వాడుతాడు. ఇకపై సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండాలనుకుంటున్నాడట.

More

Related Stories