చైతన్య నాన్ స్టాప్ షూటింగ్స్!

Naga Chaitanya

నాగ చైతన్య మరో నాని అవుతున్నాడా? ఒకే ఏడాది మూడు సినిమాల్లో నటించడం నాని స్పెషాలిటీ. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉంటాడు. చైతన్య కూడా అలాగే మారిపోయాడు. ఈ ఏడాది ఇప్పటికే శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తి చేశాడు. తీరా విడుదల సమయానికి కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైంది. దాంతో, సినిమా విడుదల ఆగింది.

ఇప్పుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకొంది. అలాగే, చైతన్య బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో 15 నిమిషాల పాటు ఉండే గెస్ట్ రోల్ లో కనిపిస్తాడు. ఈ మూవీ షూటింగ్ కూడా లడఖ్ లో మొదలు కానుంది.

ప్రభుత్వం అనుమతిస్తే… వచ్చే నెలలోనే షూటింగ్ మొదలుపెడుదామని అమీర్ ఖాన్ భావిస్తున్నాడు. సో… చైతన్య నాన్ స్టాప్ గా నటిస్తున్నట్లే.

More

Related Stories