నాకు ఇదే ఫస్ట్: నాగ చైతన్య

Naga Chaitanya

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో ‘బంగార్రాజు’ మొదటి రోజు బంపర్ కలెక్షన్లు అందుకొంది. నాగార్జునకి సంక్రాంతి హిట్స్ ఉన్నాయి. కానీ నాగ చైతన్యకి ఇదే మొదటి సంక్రాంతి రిలీజ్. “నా కెరియర్లో మొదటిసారి సంక్రాంతికి సినిమా విడుదలైంది. ఇది ఫస్ట్ పొంగల్ హిట్. ఆనందంగా ఉంది. నేను ఊహించలేదు ఈ రేంజు రెస్పాన్స్ వస్తుంది,” అని అన్నాడు నాగ చైతన్య.

సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో భారీ ఓపెనింగ్స్ ని సాధించింది బంగార్రాజు. మొదటి వీకెండ్ మంచి కలెక్షన్లను పొందుతుంది అని చెప్పొచ్చు.

నాగార్జున కూడా ఆనందంగా ఉన్నారు. “జ‌న‌వ‌రి 14 మాకు ప్ర‌త్యేక‌మైన రోజు. అన్న‌పూర్ణ స్టూడియోస్ పుట్టిన‌రోజు. నాన్న‌గారికి సంక్రాంత్రికి సినిమాలు విడుద‌ల చేయాల‌ని అంటుండేవారు. నాన్న‌ నటించిన ‘ద‌స‌రా బుల్లోడు’ జ‌న‌వ‌రి14న విడుద‌లై సంచలన విజయం సాదించింది. ఆ సెంటిమెంట్ పనిచేసింది.”

ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.

 

More

Related Stories