చైతన్య నుంచి వరుసగా సినిమాలు!

Thank You


నాగ చైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’ సినిమాకి విడుదల తేదీ ఖరారు అయింది. జులై 8న విడుదల కానుంది ఈ మూవీ. ఇక, నాగ చైతన్య నటించిన మొదటి హిందీ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టులో థియేటర్లలోకి రానుంది. ఇందులో చైతన్య హీరో కాదు. కానీ కీలకమైన పాత్రలోనే కనిపిస్తారు చైతన్య.

ఇలా వరుసగా రెండు సినిమాలు రెండు నెలలో గ్యాప్ లో రానున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా నాగ చైతన్య కోవిడ్ టైంలోనే షురూ చేశాడు. కానీ షూటింగ్ లలో జాప్యం, సరైన విడుదల తేదీ దక్కకపోవడంతో ఆలస్యమైంది. హీరోగా జులైలో అదృష్టం పరీక్షించుకొని, ఆగస్టులో బాలీవుడ్ లో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అనుకోకుండా ఈ రెండు సినిమాలు ఒకే సీజన్ లో విడుదల కానున్నాయి.

నాగ చైతన్య గతేడాది తన భార్య సమంత నుంచి విడిపోయాడు. అలాగే, శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ని విడుదల చేసి విజయం సాధించాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘బంగార్రాజు’ సినిమాలో కూడా కనిపించాడు.

ఈ ఏడాది ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’లతో థియేటర్లలో అభిమానులను పలకరించే చైతన్య వెబ్ స్పేస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. చైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’ ఈ ఏడాదే అమెజాన్ లో విడుదల కానుంది. అంటే, ఈ ఏడాది మూడు థియేటర్ విడుదలలు, ఒక వెబ్ రిలీజ్ అన్నమాట.

 

More

Related Stories