ఆ ఒక్కటీ అడక్కు: నాగ చైతన్య

Naga Chaitanya

“ఆ ఒక్కటీ అడక్కు”… ఇది సినిమా టైటిల్ కాదు. ఇప్పుడు నాగ చైతన్య చెప్తున్న డైలాగ్. నాగ చైతన్య – సమంత విడాకుల గురించే మీడియాలో, సోషల్ మీడియాలో గోల. ఈ నేపథ్యంలో నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదల కానుంది. సహజంగానే చైతన్య కనిపిస్తే మీడియా ఇదే ప్రశ్న వేస్తుంది కదా.

అందుకే, ఆ ప్రశ్నల అడగకూడదని ముందే ఈ సినిమా మేకర్స్, పీఆర్వోల టీం మీడియాని కోరుతోంది. ఇప్పటికే దినపత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నాగ చైతన్య. రేపు, ఎల్లుండి టీవీ ఛానెల్స్ ఇంటర్వ్యూలున్నాయి. అన్ని మీడియా సంస్థలు ఇంటర్వ్యూ కావాలంటే ఆ ప్రశ్న అడగకూడదంట.

తన సినిమా మాత్రమే హైలైట్ కావాలి. తన వక్తిగత జీవితం గురించి ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ పొతే సినిమా సైడ్ అయిపోతుందని నాగ చైతన్య భావన. అందుకే ఇలా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

‘లవ్ స్టోరీ’ ఈ నెల 24న విడుదల కానుంది. హీరోలకు, హీరోయిన్ల అందరికి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సినిమా విడుదల టైంలో వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది.

 

More

Related Stories