ఈసారి స్ట్రాంగ్ కథతోనే వస్తున్నాడట

- Advertisement -


ఈ సారి యంగ్ హీరో నాగ చైనత్య స్ట్రాంగ్ కథతో వస్తున్నాడు. మత్స్యకార వలసలు, పాక్ కు చిక్కడం వంటి అంశాల ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించనున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కథపై నాగ చైతన్య దృష్టి సారించాడు. దీనిలో భాగంగా ఎచ్చెర్ల మండలం కే. మత్స్యలేశం గ్రామంలో నాగ చైతన్య, చందు మొండేటి, బన్నీవాస్ పర్యటించనున్నారు.

2018లో గుజరాత్ విరావల్ నుంచి వేటకెళ్లి పాక్ కోస్ట్ గార్డ్‌కి 21 మంది మత్స్యకారులు చిక్కారు. కేంద్రం సంప్రదింపులతో పాక్ చెర నుంచి మత్స్యకారులు విడుదలయ్యారు. కే. మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని సినిమాగా చందు మొండేటి తెరకెక్కించనున్నారు. గతంలో గుజరాత్ నుంచి చేపల వేటకు పాకిస్తాన్‌కు వెళ్ళి అక్కడి పోలీసు అధికారులకు చిక్కి రెండేళ్ల పాటు రామారావు జైలులో ఉన్నాడు.

పాకిస్తాన్ లో చిక్కుకున్న తరువాత తిరిగి ఇండియాకు రావడాన్ని కథాంశంగా చందు మొండేటి ఎంచుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. చందూ ఆరు నెలల క్రితం ఓ కథ చెప్పారని.. అది విని చాలా ఇన్‌స్పైర్ అయ్యానన్నారు. స్థానిక మత్స్య కారులతో మాట్లాడటానికి వచ్చానని నాగ చైతన్య తెలిపాడు. వారి జీవన విధానం, స్థితి గతులను పరిశీలించడానికి వచ్చానన్నాడు. నిజ జీవితంలో జరిగిన కథను గీతా ఆర్ట్స్‌లో తీస్తున్నామని బన్నీ వాస్ తెలిపారు.

నాగ చైతన్యకి ఇది చాలా కీలకమైన మూవీ. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలి. ఎందుకంటే ఇప్పటికే వరుసగా మూడు ఫ్లాపులు చూశాడు.

ALSO READ: Naga Chaitanya to play a fisherman in his next!

 

More

Related Stories