నాగశౌర్యకి లక్ తిరిగిదెప్పుడో!

Naga Shaurya


హీరో నాగశౌర్యకి ఇటీవల ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా అపజయాలే. ‘వరుడు కావలెను’ సినిమా ఒక్కటే కాస్త ఆడింది. ‘అశ్వత్థామ’, ‘లక్ష్య’, ‘కృష్ణ వృందా విహారి’… ఇలా మూడు ఫ్లాపులు చూశాడు.

తాజాగా “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” విడుదలైంది. కానీ ఫలితం మారలేదు. ఈ సినిమాకి ఘోరమైన రివ్యూస్ వచ్చాయి. టాక్ కూడా అంతే బ్యాడ్. జనం కూడా ఎవరూ థియేటర్ వైపు చూడలేదు. సో, నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్.

నాగశౌర్య యాక్షన్ సినిమా చేసినా విజయం దక్కలేదు. రొమాంటిక్ చిత్రాలు చేసినా సక్సెస్ రాలేదు. దాంతో, ఈ హీరో ఇప్పుడు ఎలాంటి సినిమాలు చెయ్యాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ లో పడ్డాడు. మరి ఆయన ఎలా మారుతుందో.

ప్రస్తుతం అతని చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories