
మొన్నటి వరకు ‘చాకోలెట్’ బాయ్ అన్న ఇమేజ్ ఉండేది నాగశౌర్యకి. ఇప్పుడు కండలు, సిక్స్ ప్యాకులతో తన శరీరాకృతిని మార్చేశాడు ఈ యువ హీరో. చాకొలేట్ బాయ్ కాస్తా హాట్ గై అయ్యాడన్నమాట.
సిక్స్ ప్యాక్ సాధిస్తేనే సరిపోదు దాన్ని చూపించుకోవాలి కదా! అందుకే, నాగశౌర్య తన కొత్త రూపాన్ని మురిపెంగా మొబైల్ కెమెరాలో బంధించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
ఇక, ఆయన నటించిన నాలుగు సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. ఈ కరోనా సంక్షోభంలో అవన్నీ స్మూత్ గా విడుదల చెయ్యడం పెద్ద పని. ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు ఈ ఏడాది విడుదల కావొచ్చు.
ఇక సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఓ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. ‘పొలీసు వారి హెచ్చరిక’ అనే మరో మూవీ ఇంకా మొదలు కాలేదు. ఈ కొత్త సినిమాలన్నింట్లో తన ఆరు పలకల దేహాన్ని చూపిస్తాడట.