మల్టిఫుల్ సినిమాలతో కష్టాలు!

- Advertisement -

నాగశౌర్య, నాని, సత్యదేవ్… వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకున్నారు. స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసే టార్గెట్ తో కోట్ల పారితోషికాన్ని బ్యాంకులో వేసుకున్నారు. ఐతే, కరోనా ఉపద్రవాన్ని వారు ఊహించలేదు. మొదటి వేవ్ ని పక్కన పెడితే రెండో వేవ్ కొంప ముంచుతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. మిగతా హీరోలతో పోల్చితే నాగశౌర్యకి ఎక్కువ ఇబ్బంది వచ్చి పడింది.

నాగశౌర్య నటిస్తున్న నాలుగు సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కొన్ని రోజుల వర్క్ తప్ప షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకొని వేసవి సెలవుల్లోనే విడుదల కావాల్సిన ‘వరుడు కావలెను’కి బ్రేక్ పడింది. అలాగే, ‘లక్ష్య’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. రెండో లాక్డౌన్ వల్ల ఇది ఆగింది. ఇక అవసరాల శ్రీనివాస్ తీస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, మహేష్ కోనేరు నిర్మిస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ ప్రొడక్షన్ దశలోనే ఆగాయి.

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత సినిమాల విడుదలలు మొదలైన తర్వాత ఈ నాలుగు సినిమాలను నాగశౌర్య విడుదల చేసుకోవాలి. ప్రోమోట్ చేసుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలంటే క్రేజ్ ఉండదు. ఇటీవల నితిన్ అలా చేసే బోల్తా కొట్టాడు. ఇప్పుడు అదే నాగ శౌర్య వర్రీ.

 

More

Related Stories