నాగశౌర్యకు ఎందుకంత తొందర?

Naga Shaurya

హీరో నాగశౌర్య ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నాడో ఠక్కున చెప్పగలరా? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఒక సినిమా సెట్స్ పైకి వచ్చాడనుకునేలోపే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. శౌర్య చేతిలో ఏకంగా 5 సినిమాలున్నాయి.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” అనే సినిమా చేస్తున్నాడు శౌర్య. వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతలోనే లాక్ డౌన్ పడింది. త్వరలోనే మళ్లీ మొదలవుతుంది. ఈ మూవీతో పాటు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేపీ రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు

అది కూడా పైప్ లైన్లో ఉంటుండగానే సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవీ స్టార్ట్ చేసి సెట్స్ పైకి కూడా తీసుకొచ్చాడు. ఇందులో నాగశౌర్య విలుకారుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో రీతూవర్మ హీరోయిన్ గా మరో సినిమా చేస్తున్నాడు.

ఇన్ని సినిమాలకు తోడు తాజాగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్ పై మరో సినిమా ఎనౌన్స్ చేశాడు శౌర్య. ఇలా ఒకేసారి 5 సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇవి కేవలం అధికారికంగా ప్రకటించిన సినిమాలు మాత్రమే. డిస్కషన్ స్టేజ్ లో మరో 2 సినిమాలున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లాక్ డౌన్ గ్యాప్ ను భర్తీ చేయాలనుకుంటున్నాడు శౌర్య. అందుకే ఇంత తొందర.

Related Stories