10 ప్యాక్ సాధిస్తా: శౌర్య

Naga Shaurya in NS20
Naga Shourya in NS20

ఉన్నట్టుండి చాక్లెట్ బాయ్ కాస్తా సిక్స్ ప్యాక్ లోకి మారిపోయాడు. క్యూట్ గా కనిపించే వాడు ఫుల్ గా గడ్డం పెంచేశాడు. నాగశౌర్యలో ఇంతమార్పు ఎవ్వరూ ఊహించలేదు. తను ఎందుకు సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు శౌర్య.

“అందరూ నన్ను చాక్లెట్ బాయ్ అంటారు. నాకు మైండ్ లో అలానే ఉండిపోయిందేమో.  ఇమేజినేషన్ లో నాకెప్పుడూ సిక్స్ ప్యాక్ ఐడియా రాలేదు. నా ఫేస్ కు సిక్స్ ప్యాక్ సెట్ అవుతుందా అనేది నాకు పెద్ద డైలమా. ఆర్చరీ స్టోరీ నన్ను చాలా ఇన్ స్పైర్ చేసింది. అప్పుడే సిక్స్ ప్యాక్ ఫిక్స్ అయ్యాను. లాక్ డౌన్ పడకముందే జిమ్ స్టార్ట్ చేశాను. లాక్ డౌన్ ఇంకా బాగా కలిసొచ్చింది.”

నిజానికి సిక్స్ ప్యాక్ కావాలని దర్శకుడు డిమాండ్ చేయలేదంట. ఎలాగూ ఫిట్ గా ఉండాలని డైరక్టర్ అడిగాడు కాబట్టి, సిక్స్ ప్యాక్ చేస్తే మూవీకి మరింత అడ్వాంటేజ్ అవుతుందని శౌర్య కష్టపడ్డాడట.

అయితే సిక్స్ ప్యాక్ తో ఆగలేదు ఈ హీరో. ఏకంగా ఎయిట్ ప్యాక్ సాధించాడు. ప్రస్తుతం 10 కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. త్వరలోనే సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తన మొట్టమొదటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ స్టార్ట్ అవుతుందంటున్నాడు ఈ హీరో.

Related Stories