- Advertisement -

నాగబాబు కొటేషన్లు కొట్టడంలో స్పెషలిస్ట్. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో తన అభిప్రాయాలను పంచుకునే నాగబాబు తాజాగా ఒక కొటేషన్ షేర్ చేశారు.
తాను ఎవరినీ అంత త్వరగా వదులుకోనని అని చెప్తూ ఆయన పెట్టిన కొత్త కామెంట్ చర్చకి దారితీసింది. ఎవరినో టార్గెట్ చేసి ఆయన ఈ కామెంట్ పెట్టి ఉంటారనే అంటున్నారు.
“మనుషుల్ని వదులుకోవటానికి నేను ఇష్టపడను. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు.” ఇది ఆయన కొటేషన్.
ఇంతకీ ఆ ‘వెధవ’ ఎవరో? అదేనండి ఆయన వదులుకున్న వ్యక్తి. సాధారణంగా నాగబాబు తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, తన ఫ్యామిలీ హీరోలను ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఇలాంటివి వదులుతుంటారు. మరి ఈ సారి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో అర్థం కావడం లేదు.