మోహన్ బాబు కి నాగబాబు కౌంటర్

- Advertisement -

గతంలో ‘మా’ కోసం కొన్న భవనాన్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఆ లావాదేవీల్లో జరిగిన అవకతవకలు ఏంటి అని సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రశ్నించడంతో నాగబాబు స్పందించారు. నాగబాబు కూడా మోహన్ బాబు ప్రశ్నలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

కొన్నేళ్లుగా ‘మా’లో ఇవే ఆరోపణలు మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయి. “మా” ఎన్నికల్లో తన కుమారుడు విష్ణు అధ్యక్షుడిగా పోటీ పడుతుండడంతో మోహన్ బాబు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ఇదే పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ కి నాగబాబు మద్దతు ఇస్తున్నారు. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటో చూద్దాం.

  • శ్రీనగర్ కాలనీలో భవనం కొన్నాం. దానికి 71 లక్షల 72 వేలు, ఇంటీరియర్ కి మరో 15 లక్షలు ఖర్చు అయ్యాయి. 2017లో శివాజీరాజా అధ్యక్షుడిగా, నరేష్ కార్యదర్శిగా ఉన్నప్పుడు అమ్మేశారు. అమ్మే సమయంలో దాని విలువ రూ.95 లక్షలు. కానీ చివరికి రూ.35 లక్షలకు మా అసోసియేషన్. దాన్ని అమ్మిన టైంలో నేను అధ్యక్షుడిని కాదు. నాకు పదవి లేదు. మరి ఎవరో అమ్మారో వల్లే ఇప్పుడు మీ వెనుకాల ఉన్నారు. ఎందుకు అమ్మారో అని నరేష్, శివాజీ రాజాలని మీరు గట్టిగా అడగాలి.
  • భవనం ఎందుకు కొనాల్సి వచ్చిందో నేను చెప్పాను, ఎందుకు అమ్మారో వాళ్లను అడగండి
  • ఈ సారి మా ఎన్నికల్లో శ్రీకృష్ణుడులా ఉంటానని చెప్పారు నరేష్. కానీ ఆయన విష్ణుకే మద్దతు ఇస్తున్నారు.
  • మా ఎన్నికలకు సంబంధించి నేను ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇస్తున్నాను.
  • ప్రకాశ్ రాజ్ పై ప్రాంతీయతపై ఎంతకాలం ఏడుస్తారు.
  • భవనం ఒక్కటే సమస్య కాదు. ‘మా’కు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వాటిని నెరవేర్చే వారికే నా మద్దతు. ప్రకాష్ రాజ్ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తా.
 

More

Related Stories