నేను మంచోడ్ని కాదు: నాగబాబు

Nagababu

ఒకే ఒక్క విషయంలో తను మంచోడ్ని కాదంటున్నారు నాగబాబు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే లెఫ్ట్-రైట్ ఇచ్చేస్తానని.. ఆ విషయంలో తను మంచోడ్ని కాదని అంటున్నారు.

“నేను కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తానని అంటారు. నేను కాంట్రవర్సీలు చేయను. నిజాలు మాట్లాడతానంతే. ఎదుటివారికి బాధ కలిగించే తప్పులు ఎప్పుడూ చేయను. కానీ జనాలకు మాత్రం అది నచ్చదు. బేసిగ్గా నేను వ్యక్తుల జోలికి వెళ్లను. నా జోలికి వస్తే మాత్రం వందశాతం వదలను. మమ్మల్ని టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే కచ్చితంగా ఎటాక్ చేస్తాను. ఆ విషయంలో నేను అస్సలు మంచోడ్ని కాదు,” ఇలా కొంత సొంత డబ్బా చేసుకుంటూ వివరణ ఇచ్చారు నాగబాబు.

అయితే కాంట్రవర్సీల్ని ఎదుర్కొనే క్రమంలో అర్హత, స్థాయి లేని వ్యక్తుల విమర్శలకు సమాధానాలివ్వనని అంటున్నారు.

“నాకు అసలే ఓపిక తక్కువ. మా ఇంట్లో వాళ్లను లేదా ఇండస్ట్రీని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోను. మనకెందుకులే వదిలేద్దాం అనుకునే రకం కాదు. కచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. అయితే ఈ క్రమంలో కొంతమందికి నేను అసలు ఆన్సర్ ఇవ్వను. ఫలానా వ్యక్తులు మనకు సాటి కాదు అన్నప్పుడు వాళ్లకు ఆన్సర్ ఇవ్వను. వాళ్లేమన్నా పట్టించుకోను,” అని 58 ఏళ్ల నాగబాబు చెప్తున్నారు.

ఓవైపు వివాదాల్ని ఎదుర్కొంటూనే, మరోవైపు నెగెటివిటీని పట్టించుకోనంటున్నారు నాగబాబు. ఏదైనా వివాదం ఎదురైతే ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసి, అక్కడితో దాన్ని వదిలేస్తానని, తన పనిలో తాను పడిపోతానని అంటున్నారు.

Related Stories