అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు: నాగబాబు

Nagababu with wife

నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను ఎక్కువగా యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా టార్గెట్ చేస్తుంటారు. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో కూడా చురుగ్గా మారారు. అభిమానులు వేసే కొంటె ప్రశ్నలకు అంతే షార్ప్ గా సమాధానం ఇస్తుంటారు నాగబాబు.

“మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్?”… ఇది ఒక అభిమాని ప్రశ్న. ఈ ప్రశ్నని స్క్రీన్ షాట్ తీసుకొని దానికి తన సమాధానాన్ని జోడించి ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.

నాగబాబు జవాబు: “మా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు.. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను…”

నాగబాబు భార్య పేరు పద్మజ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు హీరో వరుణ్ తేజ్. మరొకరు హీరోయిన్ నిహారిక. కూతురు పెళ్లిని మొన్నే గ్రాండ్ గా చేశారు.

More

Related Stories