మనవళ్ల కోసమే చూస్తున్నా: నాగ్

మనవళ్ల కోసమే చూస్తున్నా: నాగ్

రియల్ లైఫ్ లో తాతయ్య అవ్వాలని ఎదురుచూస్తున్నారట నాగార్జున. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా చెప్పారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున గంగవ్వకి ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో గంగవ్వ కొన్ని పర్సనల్ ప్రశ్నలు సంధించగా, నాగ్ ఇబ్బంది పడకుండా సమాధానం ఇవ్వడం విశేషం.

గంగవ్వ: కోడలికి (సమంత) ఏమైనా పిల్లలు కలిగారా?
నాగ్ (నవ్వుతూ): నేను కూడా అదే అడుగుతున్నా ఇద్దరిని. మనవడిని లేదా మనవరాలిని ఎప్పుడిస్తారని.
గంగవ్వ: మరి చిన్న కొడుకు (అఖిల్) పెళ్లి సంగతి …
నాగ్: తనకే వదిలేశా… తన ఇష్టం..
గంగవ్వ: అట్లా ఎట్లా… మనం చూడాలి కదా పిల్లని. మా వూళ్ళో మస్తు మంది పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు… సంబంధం చూడమంటే మాట్లాడుతా.
నాగ్: హా..హా. చెప్తా అఖిల్ కి గంగవ్వ ఇలా అడిగింది అని.

నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ ఏప్రిల్ 2న విడుదల కానుంది.

 

More

Related Stories