నాగార్జున వెనక్కి తగ్గుతాడా?

The Ghost


హీరో నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఐతే, అదే డేట్ ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిక్స్ చేసుకున్నారు. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న రానుంది.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున చిత్రాలు పోటీపడడం ఏంటి అని ఇరువురి అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే, చిరంజీవి, నాగార్జున ఆప్తమిత్రులు. వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఒక సినిమా తేదీ మారిపోతుంది.

మెగాస్టార్ కోసం నాగార్జున తన సినిమా డేట్ ని మార్చే అవకాశం ఉందట. రెండు రోజులు ముందుకో, వెనక్కో ‘ది ఘోస్ట్’ని మారుస్తారని సమాచారం. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

దసరా సెలవులు అక్టోబర్ 9 వరకు ఉన్నాయి. సో, రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సిన అవసరం లేదు.

 

More

Related Stories