నాగార్జున అలా కవర్ చేశాడు

Wild Dog

లాక్ డౌన్ వల్ల దాదాపు 7 నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయిన సెలబ్రిటీస్ అంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఓవైపు షూటింగ్స్ మొదలుపెడుతూనే, మరోవైపు తీరిక చేసుకొని ఎన్నాళ్లనుంచే ఎదురుచూస్తున్న విహారయాత్రలు షురూ చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం ఒకేసారి ఈ రెండూ కవర్ చేశాడు.

“వైల్డ్ డాగ్” షూట్ కోసం మనాలీ వెళ్లాడు నాగ్. సముద్రమట్టానికి 13వేల అడుగుల ఎత్తులో ఉండే రోహ్ తంగ్ పాస్ లో షూట్ చేస్తున్నాడు. ఓవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు మనాలీ అందాల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఇటు షూటింగ్, అటు వెకేషన్ రెండూ కవర్ చేస్తున్నాడన్నమాట.

7 నెలల గ్యాప్ తర్వాత ఇలాంటి ప్లేస్ కు రావడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు నాగ్. మరో 21 రోజుల్లో వైల్డ్ డాగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని కూడా ప్రకటించాడు.

Related Stories