నాగార్జునకు కథల కష్టాలు

Nagarjuna Bigg Boss 5


సీనియర్ హీరోలు ఇప్పటికీ బిజీగా ఉన్నమాట వాస్తవమే. ఐతే, ఎలాంటి సినిమాలు చెయ్యాలి అనే విషయంలో మాత్రం వారికి క్లారిటీ రావడం లేదు. వాళ్ళ పాత ఇమేజ్ ఈ తరానికి నచ్చదు. వేరే చేస్తే జనం రావడం లేదు. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ లకు పెద్దగా సమస్య రావడం లేదు కానీ నాగార్జునకి మాత్రం చాలా ఇబ్బంది ఉంది.

నాగార్జునకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆయన్ని అలా చూడడం లేదు. “మన్మధుడు 2” చేస్తే రిజెక్ట్ చేశారు జనం.

తన ఏజ్ కి తగ్గట్లు ఉండాలని యాక్షన్ సినిమాల జోనర్ కి వచ్చారు నాగ్. ఐతే, ఈ తరహా సినిమాలు అస్సలు ఆడడం లేదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘ఆఫీసర్’తో మొదలైంది ఈ ఫ్లాప్ ల పరంపర. ఆ తర్వాత ‘వైల్డ్ డాగ్’ చేస్తే దాన్ని తిప్పికొట్టారు. ఇప్పుడు ‘ది ఘోస్ట్’ అని నటిస్తే జనం పట్టించుకోలేదు. దాంతో, నాగార్జునకు ఏ సినిమాలు చెయ్యాలి అనే విషయంలో డైలమా మొదలైంది..

ఈ మధ్య కాలంలో ‘బంగార్రాజు’ ఒకటి ఆడింది. కానీ ఆ సినిమాలో నాగార్జున హీరో కాదు. అతిథి పాత్ర అనుకోవచ్చు. అందుకే, నాగార్జునకి ఇప్పుడు కథల కష్టాలు మొదలయ్యాయి.

 

More

Related Stories