కొడుకుల కోసం నాగార్జున ప్రార్థన

Nagarjuna and Amala

నాగార్జున, అమలల ముద్దుల కుమారుడు అఖిల్ అక్కినేని హీరోగా అడుగుపెట్టి ఇప్పటికే ఆరేడు ఏళ్ళు అయింది. పెద్ద హీరోగా నిలుస్తాడని భావించినా ఆయన ఇంకా హీరోగా గట్టిగా నిలదొక్కుకోలేదు. అందుకే, నాగార్జున, అమల తాజాగా తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకొని ప్రార్థనలు చేశారు.

అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఇది హిట్టయితే అఖిల్ రేంజ్ పెరుగుతుంది. అందుకే, ఈ సినిమా విజయం కావాలని కోరుకుంటూ అమల, నాగార్జున ఈ రోజు (ఏప్రిల్ 26) తిరుమలలో పూజలు చేశారు. నాగార్జున తిరుపతి వెంకన్న భక్తుడు. తరుచుగా తిరుమల వెళ్తుంటారు. ఈసారి కొడుకు సినిమా హిట్ కావాలని ఆ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇప్పటికే అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య తిరుమలకి వెళ్లి పూజలు చేశారు.

“ఏజెంట్ సినిమా, కస్టడీ సినిమా రెండూ విడుదల అవుతున్నాయి. ముందు ఏజెంట్ వస్తోంది. వచ్చే నెల కస్టడీ. అఖిల్, చైతన్య ఇద్దరూ కష్టపడ్డారు. కానీ ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి కదా. అందుకే వేంకటేశ్వరుడిని ప్రార్థించుకున్నాం,” అని అన్నారు నాగార్జున.

 

More

Related Stories