అమితాబ్ స్థానంలో నాగార్జున

Nagarjuna


నాగార్జున హీరోగా ఈ మధ్య హిట్స్ అందుకున్నది లేదు. కానీ, ఆయన ఖాతాలోకి బ్రాండ్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా అమితాబ్ బచ్చన్ కి చెందిన ఒక బ్రాండ్ నాగార్జున చెంత చేరింది.

తాజాగా నాగార్జున ఈ బ్రాండ్ కి సంబందించిన యాడ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.

‘మాజా’ అనే కూల్ డ్రింక్ బ్రాండ్ యాడ్ లో నాగార్జున నటించారు. ఇంతకుముందు ఈ యాడ్ లో అమితాబ్ బచ్చన్, పూజ హెగ్డే చేశారు. పూజ హెగ్డే ఈ కొత్త యాడ్ లో కూడా ఉంది, అమితాబ్ స్థానంలో నాగార్జున వచ్చి చేరడం విశేషం.

నాగార్జున గతేడాది ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో నటించారు. అందులో ‘ది ఘోస్ట్’లో మాత్రమే ఆయన సోలో హీరో. అదే దారుణంగా పరాజయం పాలైంది. మిగతా రెండింటిలో ఆయన హీరో కాదు. అవి ఆడాయి. ఈ ఏడాది రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో నటించనున్నారు.

 

More

Related Stories