నాగార్జున నిర్ణయం కరెక్టేనా?

Wild Dog

నాగార్జున హీరోగా రూపొందుతోన్న ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాని నెట్ ఫ్లిక్స్ కొనుక్కొంది. డైరెక్ట్ గా తమ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ నిర్మాతలకు భారీ మొత్తం ఆఫర్ చేసింది. అక్షరాలా 27 కోట్ల రూపాయలు. నిర్మాతలు… శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముకోవచ్చు. ఆ లెక్కన నాగార్జున సినిమాకి ఇది సూపర్ ఆఫర్. అందుకే నిర్మాతలు మారుమాట్లాడకుండా ఒప్పందం చేసుకున్నారు.

ఐతే, ఇప్పుడు థియేటర్లు పూర్తిగా తెర్చుకోవడం. సినిమాలు బాగా ఆడుతుండడంతో నాగార్జున మనసు మార్చుకున్నాడు. నాగ్ మనసు ప్రకారం నిర్మాతలు కూడా ఆలోచన మార్చుకున్నారు. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకున్నారు. డైరెక్ట్ గా ఓటిటిలో కాకుండా… ముందు థియేటర్లో రిలీజ్ చేసి తర్వాత డిజిటల్ రిలీజ్ కావాలని అగ్రిమెంట్ మార్చుకున్నారు. దాంతో రేట్స్ కూడా మారిపోయాయి.

ఇప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. ఐతే, థియేటర్లో ఈ సినిమా దాదాపు 60 కోట్ల గ్రాస్ పొందాలి, అప్పుడే, నెట్ ఫ్లిక్స్ చేసిన అఫర్ కి సమానం అవుతుంది. అంతకన్నా తక్కువ వసూళ్లు వస్తే… నిర్మాతల నిర్ణయం తప్పు అవుతుంది. మరి ఏమి అవుతుందో చూడాలి?

More

Related Stories