
బిగ్ బాస్ ఐదో సీజన్ (Bigg Boss Telugu 5)… ఈ ఆదివారం షురూ. కానీ ఈ సారి నాగార్జున మీడియాని కలవలేదు. ప్రతి సీజన్ ప్రారంభం ముందు నాగార్జున మీడియాతో ముచ్చటించారు. కానీ ఇప్పుడు మిస్ కొట్టారు.
బహుశా నాగ చైతన్య, సమంత వ్యవహారం వల్లే అయి ఉంటుంది. అందమైన జంటగా పేరొందిన సమంత, చైతన్య మధ్య విభేదాలు మొదలయ్యాయి అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియా మీట్ పెడితే, దాని గురించి ప్రశ్న వస్తుంది అనే ఉద్దేశంతోనే నాగార్జున ఈ సారి డుమ్మా కొట్టినట్లు కనిపిస్తోంది.
ఇక Bigg Boss Telugu 5 విషయానికి వస్తే.. ఈ సారి పేరొందిన సినిమా హీరోలు, హీరోయిన్లు కానీ, న్యూస్ యాంకర్లకు కానీ చోటు ఉండడం లేదట. ఎక్కువగా సింగర్లు, చిన్న నటులు, వర్ధమాన హీరోలు, హీరోయిన్లు, యూట్యూబ్ స్టార్స్, ఇన్ స్టాగ్రామ్ స్టార్స్ కనిపిస్తారట. ఐతే, మసాలా మాత్రం గట్టిగానే ఉంటుంది.
Bigg Boss Telugu 5.. ఈ ఆదివారం స్టార్ మాలో ప్రసారం అవుతుంది.