
నాగార్జున దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. గతేడాది దసరాకు విడుదలైంది “ది ఘోస్ట్”. ఆ సినిమా పరాజయంతో మరో సినిమా చెయ్యలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఒక కొత్త సినిమా ఒప్పుకున్నారు.
బిన్నీ అనే డ్యాన్స్ మాస్టర్ కి నాగార్జున అవకాశం ఇస్తుండడం విశేషం. ఒక మలయాళ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 28న ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన రానుంది. ఎందుకంటే ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు.
ఈ సినిమాకి “నా సామి రంగా” అనే పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్. ఇద్దరు హీరోయిన్లు, మరో యువ హీరో కూడా ఈ సినిమాలో నటిస్తారు. నాగార్జున రెండు వేర్వేరు లుక్స్ లో దర్శనమిస్తారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది.
నాగార్జున ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ షో కూడా చేస్తారు. ఏడో సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. వచ్చేనెల మొదలవుతోంది. అటు బిగ్ బాస్ షూటింగ్, ఇటు ఈ మూవీ షూటింగ్ రెండింటితో బిజీ బిజీ.