నాగార్జున ‘జనవరి ఒప్పందం’

నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ ఇటీవల షూటింగ్ మొదలుపెట్టింది. అప్పుడే చివరి దశకు వచ్చింది. అంతేకాదు, కుదిరితే సంక్రాంతి బరిలో నిలవాలనుకుంటోంది.

“ఆర్ ఆర్ ఆర్ ” కనుక బాహుబలి రేంజులో హిట్టయితే నాగార్జున సినిమా ఆ వేవ్ లో కనిపించదు. నాగార్జున గత నాలుగేళ్లలో నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. మరి నాగ్ ఎందుకు పోటీకి దిగుతున్నట్లు అని అడిగితే ఒక కారణం ఉంది.

‘బంగార్రాజు’ సినిమాకి మొత్తం ఫండింగ్ చేసింది జీ స్టూడియో సంస్థ. ఆ సంస్థతో అన్నపూర్ణ స్టూడియోస్ చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాని జనవరిలో విడుదల చెయ్యాలి. సంక్రాంతి కావొచ్చు, రిపబ్లిక్ డే స్పెషల్ గా కావొచ్చు… కానీ జనవరిలో విడుదల చెయ్యాలి. జనవరి కాకుండా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే 15 శాతం ఒప్పుకున్న అమౌంట్ లో కట్ చేస్తారు. అందుకే, నాగ్ తొందర.

సంక్రాంతికి “ఆర్ ఆర్ ఆర్”, “రాధేశ్యామ్” మాత్రమే పోటీలో ఉంటే నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతి బరిలో దింపుతారు. ఒకవేళ, ఈ రెండింటితో పాటు ‘భీమ్లా నాయక్’ కూడా పోటీకి దిగితే, ‘బంగార్రాజు’ని జనవరి చివర్లో రిలీజ్ చేస్తారు.

అందుకే, ఇప్పటి నుంచే ప్రొమోషన్ షురూ చేస్తున్నారు నాగార్జున. డేట్ ఎప్పుడు అనేది భీమ్లా నాయక్ ని బట్టి ఉంటుంది.

Advertisement
 

More

Related Stories