సీరియస్ లుక్ లో అదరగొట్టిన నాగార్జున

Bigg Boss Telugu 4 – Episode 14

నాగార్జున ఇప్పటివరకు కనిపించిన తీరు వేరు… శనివారం ఎపిసోడ్ లో ప్రదర్శించిన సీరియస్ నెస్ వేరు. నాగార్జున హోస్ట్ గా కొత్తగా కనిపించారు. ఈ ఎపిసోడ్ అదిరిపోయింది…నాగార్జున సీరియస్ హోస్టింగ్ వల్ల.

ఇక ఎపిసోడ్ రివ్యూ…

హౌజ్ లో ఉండడానికి 60 ఏళ్ల గంగవ్వ ఇబ్బంది పడుతోందంటూ కథనాలు వచ్చాయి. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆమెకు బిగ్ బాస్ హౌజ్ నుంచి విముక్తి కల్పిస్తారంటూ స్టోరీలు వచ్చాయి. వీటిపై తాజా ఎపిసోడ్ లో నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. కన్ఫెషన్ రూమ్ లో ప్రత్యేకంగా గంగవ్వతో మాట్లాడిన నాగ్.. ఆమె హౌజ్ లోనే కొనసాగుతుందని స్పష్టంచేశాడు. ఆమె బయటకు వచ్చే ఛాన్స్ లేదని, కేవలం ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా మాత్రమే ఆమెను బయటకు పంపించగలరని అన్నారు.

ఇదే సీన్ లో నాగ్ చెప్పిన ఓ డైలాగ్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తనను ఆప్యాయంగా అన్న అని పిలిచిన గంగవ్వను.. ఇకపై చెల్లెలిగా చూసుకుంటానని, హౌజ్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని గంగవ్వకు హామీ ఇచ్చాడు నాగ్.

ఇక Bigg Boss Telugu 4 – Episode 14 హైలెట్స్ విషయానికొస్తే.. నిన్న నాగ్ పెట్టిన పోటీ భలే ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఏ పోటీ పెట్టినా కంటెస్టెంట్లు దాన్ని కామెడీగా తీసుకుంటున్నారని, సెల్ఫ్ ఎలిమినేషన్లు చేసుకుంటున్నారని గట్టిగా క్లాస్ పీకిన నాగ్.. ఈసారి హీరో-జీరో అనే కంటెస్ట్ పెట్టి హౌజ్ లో సభ్యుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. అల్టిమేట్ గా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు.

సభలో కంటెస్టెంట్లు అంతా తమకు నచ్చిన వ్యక్తిని హీరోని చేసి కుర్చీలో కూర్చోబెట్టాలి. నచ్చని వ్యక్తిని మెడ పట్టి జీరో డోర్ నుంచి బయటకు నెట్టేయాలి. ఈ పోటీతో హౌజ్ లో వ్యక్తుల మధ్య తేడా క్లియర్ గా తెలిసొచ్చింది. ఇన్నాళ్లూ ఆడిన కపట నాటకాలన్నీ బయటపడ్డాయి.

ఇక కీలకమైన ఎలిమేషన్ రౌండ్ విషయానికొస్తే.. ఈ వీకెండ్ ఏకంగా ఇద్దర్ని ఎలిమినేట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు నాగ్. ఐతే నిజంగా ఇద్దరినీ ఎలిమినెట్ చేస్తాడా? లేక ఒక్కరితోనే సరిపెడుతాడా అన్నది సండే ఎపిసోడ్ లో తేలుద్ది.

చెప్పినట్టుగానే శనివారం ఎపిసోడ్ లో కరాటే కల్యాణిని ఎలిమినేట్ చేశారు.

Related Stories