ఓల్డ్ గా కనిపించడం ఎంత కష్టం!

nagarjuna oldman

అక్కినేని నాగార్జున అందమే అందం. నేడు ఆయన 60లోకి ఎంటర్ అయ్యారు. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకి పోటీ ఇచ్చే అందం, బాడీ ఆయన సొంతం. సాధారణంగా సీనియర్ హీరోలు యంగ్ గా కనిపించేందుకు … మేకప్ వేసుకొని ఎన్నో కష్టాలు పడుతుంటారు. ముసలి పాత్రలకి వాళ్ళకి గెటప్, మేకప్ అవసరం ఉండదు. కానీ నాగార్జునని ఓల్డ్ గా చూపించాలంటే ఎంతో కష్టం.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో కోసం నాగార్జున అటు యంగ్ మేన్ గా, ఓల్డ్ మేన్ గా కనిపించాడు. కానీ ఆయనకి ప్రోస్తెటిక్ మేకప్ అవసరం పడింది …. ముసలి గెటప్.

ఈ వయసులో కూడా ఇంచ్ కూడా పొట్ట పెరగలేదు… ఫ్లాట్ స్టొమక్. అందుకే ఓల్డ్ మేన్ గా గెటప్ వేసేందుకు ఎక్కువ కష్టపడ్డారంట. ఎవర్ గ్రీన్ కింగ్… నాగార్జునకి బర్త్ డే విషెస్.

Related Stories