కరోనా టెస్ట్ చేయించుకున్న నాగార్జున

Nagarjuna

తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు చిరంజీవి ప్రకటించిన వెంటనే నాగార్జున అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే, వీళ్లిద్దరూ కలిసి రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. చిరంజీవికి పాజిటివ్ అని తేలడంతో.. అంతా నాగార్జున వైపు చూశారు. ఒకవేళ నాగార్జునకు కూడా కరోనా సోకితే బిగ్ బాస్ ఇబ్బందుల్లో పడుతుంది.

ఈ మేరకు నాగార్జున కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. రేపు పరీక్షల ఫలితం వస్తుంది. నెగెటివ్ వస్తే వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోతారు. ఆయన ఈ వారంలో బాలీవుడ్ మూవీ “బ్రహ్మస్త్ర” షూటింగ్ లో పాల్గొనాలి.

నాగార్జునకు వైరస్ సోకితే ‘బ్రహ్మాస్త్ర’ మూవీతో పాటు బిగ్ బాస్ షో కూడా ఇబ్బందుల్లో పడుతుంది. “బ్రహ్మాస్త్ర” మూవీని కావాలంటే కొన్నాళ్లు వాయిదా వేయొచ్చు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షోను వాయిదా వేయడం కుదరదు. ఏ విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. 

Related Stories