నెల గ్యాప్ లో రెండు చిత్రాలు!

- Advertisement -
Lakshya


ప్రస్తుతం నాగశౌర్య చేతిలో నాలుగు, ఐదు సినిమాలున్నాయి. రెండు షూటింగ్ పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాయి. దాంతో, ఈ రెండింటిని బ్యాక్ టు బ్యాక్ విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. నాగ శౌర్య, రీతూ వర్మ నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, పాట కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు ‘లక్ష్య’ అనే మరో సినిమాని కూడా రిలీజ్ చెయ్యనున్నాడు. నవంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఇది విలువిద్య నేపథ్యంగా సాగే స్పోర్ట్స్ డ్రామా. ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ ఇది. అంటే కేవలం నెల గ్యాప్ లోనే నాగ శౌర్య నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

నాగశౌర్య నటిస్తున్న మిగతా సినిమాలను 2022లో విడుదల చేస్తారట.

 

More

Related Stories