రాజకీయాల్లోకి రానున్న నమిత!

Namitha


ఎవరో ఎప్పుడో ఎక్కడో అన్నారు… అవకాశాలు లేదా క్రేజ్ తగ్గిపోయిన హీరోలకు, హీరోయిన్లకు రాజకీయ రంగమే తదుపరి మజిలీ అని. అది నిజమే అని తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఇటీవల హీరోయిన్లు సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సాధారణం అయిపోయింది.

నమిత కూడా అదే ఆలోచనల్లో ఉంది. రాజకీయాలపై చాలా ఆసక్తి ఉందని ఆ అమ్మడు చెప్పింది. ఆదివారం ఆమె తన భర్త, పిల్లలతో కలిసి తిరుమల తిరుపతిని దర్శించుకొంది. అనంతరం మీడియాతో మాట్లాడింది. “రాజకీయాలపై ఆసక్తి ఉంది,” అని తన ఆలోచనలను పంచుకొంది.

ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియా ఆ ప్రశ్న అడిగింది.

తెలుగులో పలు సినిమాల్లో నటించిన తర్వాత ఆమె తమిళంలోకి అడుగుపెట్టి చెన్నైలో స్థిరపడింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

 

More

Related Stories