తాగుడు వల్లే బరువు పెరగలేదు

Namitha

నమితని ఒకప్పుడు బొద్దుగుమ్మ అనేవాళ్ళు. ఐతే, ఆ స్థాయి కూడా దాటి ఒక స్టేజిలో విపరీతంగా పెరిగింది. అప్పుడు ఆమెని ‘డన్ లప్ డాల్’ అని జనాలు కామెంట్స్ చేసేవారు. దాంతో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమెకి పెళ్లి అయింది. కొంచెం లావు కూడా తగ్గింది. మళ్ళీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ గా పాత విషయాల గురించి మాట్లాడింది.

“అప్పట్లో బాగా బరువు పెరగడానికి కారణం థైరాయిడ్. పీసీఓడీ, థైరాయిడ్ సమస్యల వల్ల లావు అయ్యాను. కానీ నేను పీకల వరకు తాగి బరువు పెరిగాను అని ప్రచారం చేశారు. దానివల్ల చాలా డిప్రెషన్ కి గురి అయ్యాను,” అని చెప్పింది. అప్పుడు హెల్త్ గురించి అవగాహన లేక ఆలా జరిగింది అని ఇప్పుడు లైఫ్ స్టయిల్ మార్చాను అని చెప్తోంది.

చాలా మంది హీరోయిన్లకి ఆల్కహాల్ సమస్య ఉంది. ఐతే, ఇప్పుడు కొందరు హీరోయిన్లు ఆ విషయాలను ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. ఐతే, నమిత మాత్రం తన బరువు సమస్యకి, తాగడానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

More

Related Stories