కవలలుకు జన్మనిచ్చిన నమిత!

Namitha


హీరోయిన్ నమిత కవలలకు జన్మనిచ్చింది. కవలలు ఇద్దరూ అబ్బాయిలే. చెన్నైలోని రేలా అని హాస్పిటల్ లో ఆమె డెలివరీ జరిగింది. ఆ డాక్టర్లకు ఆమె ప్రత్యేక కృతజ్నతలు తెలిపింది.

నిన్న శ్రీకష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆమె తనకి కవలలు పుట్టిన విషయాన్నీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె, ఆమె భర్త చెరో బాబుని పట్టుకొని ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. చెన్నైలో స్థిరపడ్డ వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని కొన్నేళ్లక్రితం పెళ్లాడింది నమిత.

గర్భం దాల్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఫోటోషూట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చింది. ఇప్పుడు కవలల పుట్టిన విషయాన్నీ ఒక వీడియో రూపంలో తెలపడం విశేషమే.

సొంతం, సింహ, జెమిని వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన నమిత పుట్టింది, పెరిగింది ఉత్తర భారతదేశంలోనే. కానీ, ఆమె చెన్నైలో స్థిరపడిందిప్పుడు.

 

More

Related Stories