ఒటిటి వ్యాపారంలోకి నమిత

Namitha


ఒకప్పటి గ్లామర్ క్వీన్ నమిత వ్యాపారవేత్తగా మారుతోంది. ఆమె డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. “నమిత థియేటర్” పేరుతో ఆమె ఓటిటి ని లాంచ్ చేసింది. ఈ వేదిక ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తుందట. షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిత్రాలు ఇందులో ప్రదర్శిస్తారట. ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తీసే కంటెంట్ పైనే మెయిన్ ఫోకస్ పెడుతుందట.

‘సింహా’ వంటి సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించిన నమిత చెన్నైలో సెటిల్ అయింది. ఆమె భర్త కూడా చెన్నైకు చెందినవారే.

నమిత రాజకీయాల వైపు చూపు వేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఐతే, ఆమె మాత్రం వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది.

Advertisement
 

More

Related Stories