మహేష్, బిర్యానీ చాలు: నమ్రత

Mahesh Babu and Namrata

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత ఈసారి ఏకంగా ఫ్యాన్స్ తో ఛాటింగ్ చేశారు. తన ఇష్టాఇష్టాలతో పాటు మహేష్ కొత్త సినిమా సంగతులు.. ప్రేమకబుర్లు.. పిల్లల విశేషాలు.. ఇలా ఎన్నో షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు, బిర్యానీ … ఉంటె చాలు అన్నారు. ఆ ఛిట్ చాట్ మీకోసం..

– సితార నిక్ నేమ్ ఏంటి
సీతూ అని పిలుస్తాం. అది కాకుండా పర్పి అనే కొత్త పేరు పెట్టాం. దాని అర్థం ఏంటనేది మాక్కూడా తెలియదు.

– సితార యూట్యూబ్ ఛానెల్ లో నమ్రత ఎప్పుడు గెస్ట్ అవుతుంది?
తను నన్ను సెలక్ట్ చేయలేదు. ఈ విషయంలో సితార చాలా సెలక్టివ్ గా ఉంది.

– బిర్యానీ అంటే ఇష్టమా?
అది నా ఫేవరెట్. మరీ ముఖ్యంగా అజీజాస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

– ఫేవరెట్ నటి
మెరీల్ స్ట్రీప్

– ఫేవరెట్ డ్రెస్సింగ్  స్టయిల్
వైట్ షర్ట్ – జీన్స్

– మహేష్ మరాఠీ మాట్లాడతాడా?
మహేష్ మరాఠీ మాట్లాడాలనే కోరుకుంటున్నాను..(నవ్వులు)

– మీ జీవితంలో మీరు చేసిన ధైర్యమైన పని ఏంటి?
ఓ బొద్దింకను చంపాను. దాన్ని చూడ్డానికి కూడా అసహ్యం నాకు.

– మహేష్-గౌతమ్ ఎక్కువగా ఆడే ఆట?
వాళ్లు టెన్నిస్, గోల్ఫ్, సెవెన్ పిన్స్ గేమ్స్ ఎక్కువగా ఆడతారు.

– కృష్ణ గారి గురించి
వెరీ కూల్ మామయ్య. ఇంకా చెప్పాలంటే నాక్కూడా తండ్రిలాంటివారు

– మీ ఫేవరెట్ సినిమాలు
ఒక్కడు, పోకిరి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను

– మీ బెస్ట్ ఫ్యామిలీ ట్రిప్
జర్మనీలో మేం చేసిన హాలిడే ట్రిప్ ది బెస్ట్

– ఫేవరెట్ పెర్ఫ్యూమ్
ఏంజెల్

– సితార సినిమా ఎంట్రీ ఎప్పుడు?
తనకిప్పుడు ఏడేళ్లు.. చాలా చిన్న పిల్ల

– స్కూల్ డేస్ లో చేసిన క్రేజీ పని ఏదైనా ఉందా?
ఒకటి కాదు, చాలా ఉన్నాయి. వాటిపైన ఓ పుస్తకం కూడా రాయొచ్చు

– మీకు ఇష్టమైన కారు
నా ఇన్నోవా అంటే ఇష్టం. ఎందుకంటే అది నా తల్లిదండ్రుల కారు. ఎప్పుడూ నాతోనే ఉంటుంది.

namrata mahesh


– మహేష్ పై ప్రేమను ఎప్పుడు గుర్తించారు?
షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లాం. 52 రోజుల పాటు కలిసే ఉన్నాం. షూటింగ్ లాస్ట్ డే మహేష్ ను ప్రేమిస్తున్నట్టు గుర్తించాను.

– మహేష్ బర్త్ డే ప్లాన్ ఏంటి
ఇది లాక్ డౌన్ టైమ్. కాబట్టి ఎలాంటి ప్లానింగ్ లేకపోవడమే బెస్ట్ ప్లానింగ్

– లాక్ డౌన్ లో ఓ మంచి అనుభవం
ఎప్పట్నుంచో అనుకుంటున్న మా పెరడు మొత్తం క్లీన్ చేశాను. నేను ఎలా అనుకున్నానో ఇప్పుడది అలా రూపుదిద్దుకుంది. పచ్చదనం, పక్షులతో కళకళలాడుతోంది.

– సర్కార్ వారి పాట కథ ఎలా ఉంటుంది
ఇప్పుడే చెప్పలేను కానీ ప్రతి ఎలిమెంట్ ను అంతా బాగా ఎంజాయ్ చేస్తారు

– సితార-గౌతమ్ తెలుగు మాట్లాడతారా?
వాళ్లు తెలుగు, ఇంగ్లిష్, మరాఠీ చక్కగా మాట్లాడతారు.

– లాక్ డౌన్ కు ముందు హాలిడే వెకేషన్
న్యూయార్క్, దుబాయ్

– ఆనందంగా, ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారు?
కడుపునిండా తింటాను. బాగా ఎక్సర్ సైజ్ చేస్తాను. తొందరగా నిద్రపోతాను

Related Stories