సర్కారు వారి’పాట’లో నమ్రత

- Advertisement -
Namrata Sarkaruvaaripaata

మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం… ‘సర్కారువారి పాట’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. పాటలను చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్, కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు అక్కడ.

మహేష్ బాబు ఎప్పుడూ విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసినా… అయన కుటుంబ సభ్యులు కూడా సరదాగా వెళ్తుంటారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ప్రస్తుతం స్పెయిన్ లోనే ఉన్నారు. పాట షూటింగ్ లొకేషన్ నుంచి ఒక స్టిల్ పోస్ట్ చేశారు తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై. ఈ ఫొటోలో నమ్రత, కీర్తి సురేష్ ముచ్చటించుకుంటున్న తీరు చూడొచ్చు.

పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారువారి పాట’ బ్యాంకులు, లోన్లు నేపథ్యంగా సాగే కథ. మహేష్ బాబు ఈ సినిమాలో కొంత కొత్తగా కనిపించనున్నారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం. తమన్ స్వరపరిచిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమాని ఇంతకుముందు సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్ మారే అవకాశం ఉంది.

More

Related Stories